చట్నీ కోసం :
పుదీనా ఆకులు : 1/2 కప్పు
కొత్తిమిర ఆకులు : 1/2 కప్పు
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి : 3 రెబ్బలు
కొబ్బరి పొడి : 2 టీ స్పూను
నిమ్మ రసం : 1 టీ స్పూను
ఉప్పు : తగినంత
కబాబ్స్ కోసం:
ఉడికించిన బంగాళదుంపలు : 4
ఉల్లిపాయ : 1 పుదీనా,
కొత్తిమిర : 1/4 కప్పు
ఆమ్చూర్ పొడి : 1/2 టీ స్పూను
కారం పొడి : 1 టీ స్పూను
పసుపు : 1/4 టీ స్పూను
ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి
తయారీ చేసే విధానం :
కొత్తిమిర, పుదీనా, కొబ్బరి పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నిమ్మరసం, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇది పలుచగా కాకుండా గట్టిగా ఉండాలి. బంగాళదుంపలను మెత్తగా ఉడికించి చల్లారాక తొక్క తీసి ఒక గిన్నెలో వేసి మెత్తగా మెదపాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమిర, ఆమ్చూర్ పొడి, కారం పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
పెద్ద నిమ్మకాయల సైజులో ఉండలు చేసుకుని వెడల్పు చేసి పావు చెంచాడు చట్నీ మిశ్రమం పెట్టి అన్ని వైపుల నుండి మూసేయాలి. దీన్ని ఉండలా కడుతూ మీకు నచ్చిన ఆకారంలో చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి వీటిని బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. లేదా పాన్‌లో నాలుగు చెంచాల నూనె వేసి కూడా వేయించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉంటుంది. లేదా ఓవెన్‌లో బేక్ చేసుకోవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: